గ్యాప్ తరువాత స్పీడ్ పెంచిన మెగా హీరో ?

Thursday, September 6th, 2018, 10:43:09 PM IST

వరుసగా ఆరు పరాజయాలు .. ఒకదాన్ని మించి మరొకటి గట్టిగానే దెబ్బ కొట్టాయి. దాంతో ఎదో మార్పు చేస్తే తప్ప .. తన కెరీర్ గాడిలో పడదనుకున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. అందుకే ముంబై వెళ్లి తన మేక్ ఓవర్ మార్చాడు. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఇంటిలిజెంట్ తరువాత దాదాపు మూడు నెలలు అవుతున్న నేపథ్యంలో సాయి ధరమ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. తాజాగా అయన చిత్రలహరి అనే సినిమాకు ఓకే చెప్పాడు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం ఈ నెల చివర్లో సెట్స్ పైకి రానుంది. దాంతో పాటు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడట. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధం అయిన ఈ సినిమా త్వరలోనే పట్టాలు ఎక్కనుందని సమాచారం. అయితే చిత్రలహరి కంటే ముందు మొదలవుతుందా లేదా అన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే తాజాగా గీతా గోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పరుశురామ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తాడట.

  •  
  •  
  •  
  •  

Comments