డ్రగ్స్ తీసుకున్నా అనుకున్నారు: మెగా హీరో

Saturday, December 2nd, 2017, 10:20:45 PM IST

టాలీవుడ్ మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా జవాన్ సినిమాతో వచ్చి మంచి హిట్ ను అందుకున్నాడు. చాలా కాలం తర్వాత తన సినిమాకి మంచి టాక్ రావడంతో సాయి చామా హ్యాపీగా ఉన్నాడు. అయితే కెరీర్ మొదట్లో ఈ హీరోని కొందరు దురదృష్టవంతుడు అని కామెంట్స్ చేశారట. మొదట రేయ్ సినిమాలో నటించినప్పుడు ఆ సినిమా చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. అంతే కాకుండా సినిమా ముగుంపు దశలో ఉండగా అందులో కీలక పాత్ర చేసిన నటుడు శ్రీహరి మరణించాడు.

దీంతో సాయి చాలా నిరాశ చెందాడట. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ తన లైఫ్ లోని కొన్ని విషయాలను తెలిపాడు. అయితే లైఫ్ చాలా క్రిటికల్ గా ఉన్న సమయంలో ఒక సారి ఎలాగైనా సెట్ అవ్వాలని జాబ్ చేద్దామనుకున్న కానీ నా వల్ల కాలేదు.ఆ తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను. ఇక అదే సమయంలో నాకు ఒకసారి చాలా జ్వరం వచ్చింది. అయితే రెండు రోజుల వరకు రూమ్ లోనే ఉన్నాను. దీంతో మా అమ్మగారు చాలా కంగారుపడిపోయి డ్రగ్స్ తీసుకున్నా అనుకున్నారు. తర్వాత ఫీవర్ అని తెలిసి కొంచెం కేర్ తీసుకున్నారు. ఇక నేను లైఫ్ లో ఏదైనా కొత్తగా చేయాలనీ నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని అనుకోని సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. మొదట్లో కొన్నివిమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అందరి సపోర్ట్ తో మరింత ముందుకు వెళ్లాను అని సాయి వివరించాడు.

  •  
  •  
  •  
  •  

Comments