చాలా ‘ఇంటెలిజెంట్’ గా వ్యవహరించాలి..లేకుంటే..!

Monday, January 22nd, 2018, 10:39:45 PM IST

సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ఇంటెలిజెంట్. ఈ చిత్రాన్ని మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ కెరీర్ కు ఈ చిత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ కు వరుసగా ప్లాపులు ఎదురవుతున్నాయి. తిక్క, విన్నర్, జవాన్ వంటి చిత్రాలతో సాయి ధరమ్ తేజ్ అభిమానులని నిరాశ పరిచాడు. ఇంటెలిజెంట్ చిత్రం టైటిల్ కు తగ్గట్లుగా ఉంటుందని మెగా అభిమానులు ఆశలు పెట్టుకుని ఉన్నారు.

సినీవర్గాల్లో కూడా ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. హీరోలలో ఉండే మాస్ కోణాన్ని ఆవిష్కరించడంలో వినాయక్ సిద్ధహస్తుడు. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 9 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.