హాట్ పిక్స్ : రాక్షసితో ఇంటెలిజెంట్ రొమాన్స్ !

Tuesday, January 30th, 2018, 08:13:09 PM IST

సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఇంటెలిజెంట్. వివి వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఫిబ్రవరి 9 విడుదలకు సిద్ధం అవుతోంది. ప్లాపుల్లో ఉన్న తేజు ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకుని ఉన్నాడు. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రాబోతోంది. విడుదల దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల వేగం పెంచింది.

ఈ చిత్రంలో తేజు సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అందాల రాక్షసి చిత్రం నుంచే ఈ సొట్ట బుగ్గల సుందరికి తెలుగు యువత ఫిదా అయిపోయారు. గ్లామర్ విషయంలో హద్దులు పాటించే లావణ్య ఈ చిత్రంలో తన అండ చందాలతో అలరించడానికి సిద్ధం అవుతోంది. చిత్ర యూనిట్ విడుదల చేస్తున్న రొమాంటిక్ పోస్టర్ లలో లావణ్య అందం కట్టిపడేసేలా ఉంది నాదం అతిశయోక్తి కాదు.