టాలీవుడ్ లో 3 క్రేజీ మల్టీస్టారర్లు..లేటెస్టుగా తేజు- వరుణ్..!

Friday, December 1st, 2017, 05:32:41 PM IST


మల్టీస్టారర్ సినిమాలు చేయడం అంత సులువు కాదు. ముఖ్యంగా డైరెక్టర్లకు. ఎందుకంటే అందులో నటించే హీరోల పాత్రలని బ్యాలన్స్ చేసుకోవలసి వస్తుంది. అయినా కూడా టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలు అప్పుడప్పుడూ వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాల సంఖ్య పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారని వార్త టాలీవుడ్ లో సంచలనంగా మారింది. నితిన్, శర్వానంద్ లు కూడా ఓ చిత్రానికి ఓకే చెప్పేసి సర్ ప్రైజ్ చేశారు. తాజాగా మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లు కూడా మల్టీస్టారర్ చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సరైన కథ రెడీ చేసుకుని వస్తే తామిద్దరం కలసి నటిస్తామని ఈ హీరోలిద్దరూ దర్శక,నిర్మాతలకు చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో త్వరలోనే మెగా హీరోల నుంచి ఓ చిత్రాన్ని ఆశించవచ్చని ఫాన్స్ అంటున్నారు. టాలీవుడ్ హీరోలు ప్రస్తుతం వైవిధ్యభరితమైన కథలపై ఆసక్తి చూపుతుండడంతో మల్టీస్టారర్ చిత్రాలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments