మరో మేనల్లుడికోసం రంగంలోకి పవన్ కళ్యాణ్ ?

Thursday, September 6th, 2018, 10:19:50 AM IST

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసి రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. జనసేన పార్టీ తరపున రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల పోరుకు సిద్ధం అవుతున్నాడు. అయితే అయన ఫ్యామిలి హీరోల విషయంలో మాత్రం ఎప్పుడు సపోర్ట్ అందిస్తూనే ఉన్నాడు. వాళ్ళ సినిమా వేడుకలకు గెస్ట్ గా వస్తూ మెగా ఫాన్స్ లో మరింత క్రేజ్ పెంచుతున్నాడు. తాజాగా అయన మరో మేనల్లుడికోసం ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. ఆ అల్లుడు ఎవరో కాదు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్. రేయ్ సినిమాతో హీరోయిగా ఎంట్రీ ఇచ్సినా సాయి ధరమ్ టాలీవుడ్ లో బాగానే సెటిల్ అయ్యాడు. ఇప్పుడు అయన తమ్ముడు వైష్ణవ్ ను హీరోగా పరిచయం చేసే పనులను పవన్ దగ్గరుండి చూస్తున్నాడు. వైష్ణవ తేజ్ ని హీరోగా పరిచయం చేసే పనిని దర్శకుడు డాలీకి అప్పగించాడు . పవన్ తో డాలి గోపాల, గోపాల, కాటమరాయుడు సినిమాలు తెరకెక్కిన డాలి టాలెంట్ కు నచ్చిన పవన్ తన చిన్న మేనల్లుడి బాధ్యతను అప్పగించాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెలలో సెట్స్ పైకి రానుందట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ప్రకటన రానుంది.

  •  
  •  
  •  
  •  

Comments