మెగా మేనల్లుడి ఏమైంది..ప్లాప్ డైరెక్టర్ కి మళ్లీ ఛాన్స్..?

Saturday, October 14th, 2017, 04:29:53 PM IST

పెద్ద మావయ్య మెగాస్టార్ పోలికలు, చిన మావయ్య పవర్ స్టార్ మేనరిజమ్స్ ని వారసత్వంగా పొందాడు సాయిధరమ్ తేజ్. కెరీర్ ఆరంభంలో తేజు లోని ఈ ఫీచర్స్ అభిమానులని బాగా ఆకట్టుకున్నాయి. కాగా ఇటీవల తేజుకు వరుస ప్లాపులు ఎదురుకావడడంతో కెరీర్ లో కొంత జోష్ తగ్గింది. కానీ తేజు కోసం క్రేజీ దర్శకులు క్యూలో ఉన్నారు. వివి వినాయక్ దర్శకత్వంలోని చిత్రం ఇప్పటికే ప్రారంభమైంది.

ఫిబ్రవరి నుంచి కరుణాకరన్ దర్శకత్వంలోని రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రం కూడా ప్రారంభం కానుంది. వివి వినాయక్ మాస్ చిత్రాలని తనదైన స్టయిల్ లో చిత్రీకరిస్తారు. కమర్షియల్ చిత్రాలని ఎలా హ్యాండిల్ చేయాలో వినాయక్ కు బాగా తెలుసు. ఇక కరుణాకరన్ కు లవ్ స్టోరీల స్పెషలిస్ట్ అనే పేరు ఉంది. కాగా తేజు మరో దర్శకుడికి కూడా గ్రీన్ సింగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. విన్నర్ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేనితో తేజు మరో చిత్రం చేయబోతున్నాడట. విన్నర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకొట్టింది. మళ్లీ ఆ దర్శకుడికి తేజు ఛాన్స్ ఇస్తున్నాడని వార్తలు రావడంతో మెగా అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments