ట్రాక్ మార్చిన మెగా హీరో .. అందుకే క్రైం థ్రిల్లర్ !!

Wednesday, February 21st, 2018, 12:14:51 AM IST

వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి ఏ ఒక్క సినిమా కలసిరావడం లేదు.. ఎన్నో ఆశలు పెట్టుకుని వినాయక్ లాంటి మాస్ దర్శకుడితో సినిమా చేస్తే అది అట్టర్ ప్లాప్ అయి కూర్చుంది. దాంతో మనోడికి అవకాశాలు తగ్గాయి. ఇక రొటీన్ కథలకు .. చిరంజీవి పాటలను .. రీమేక్ చేయడం .. మెగాస్టార్ ను ఇమిటేట్ చేయడం మానుకునేందుకు సిద్దమయ్యాడు. అందుకే ఈ సారి ఓ కొత్త జోనర్ ని ఎంచుకున్నాడు. తాజాగా అయన చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పాడట. యేలేటి సినిమాలంటే కాన్సెప్ట్ బేస్డ్ గా ఉంటాయి. అందుకే ఆయనకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మరో వైపు గోపీచంద్ మలినేని తో కూడా ఓ సినిమా చేయనున్నాడు. అయితే ముందుగా యేలేటి సినిమా పూర్తీ చేశాకే గోపీచంద్ సినిమా ఉంటుందట. మరి సాయి ధరమ్ ఈ భిన్నమైన సినిమాతో హిట్ అందుకుంటాడా లేదో చూడాలి !!