ఆ దర్శకుడికి నో చెప్పిన మెగా హీరో ?

Friday, May 4th, 2018, 11:20:13 PM IST


మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి ఈ మధ్య వరుస పరాజయాలు టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే వరుసగా ఐదు పరాజయాలతో టెన్షన్ మీదున్న సాయి ధరమ్ ప్రస్తుతం ప్రేమ కథా చిత్రాల దర్శకుడు కరుణాకరన్ తో తేజ్ ఐ లవ్ యూ అనే చిత్రాన్నీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలో విడుదల అవుతుంది. ఈ సినిమా తరువాత తేజ్ తో సినిమా చేయడానికి భిన్నమైన చిత్రాల దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న చంద్ర శేఖర్ యేలేటి ప్లాన్ చేసాడు. అయితే ఈ సినిమా కథ విషయంలో తేజ్ సంతృప్తిగా లేడని దాంతో ఈ దర్శకుడికి నో చెప్పాడట. అదే కథను గోపీచంద్ కి చెప్పి ఓకే చేయించుకున్నాడు యేలేటి. ఇప్పటికే గోపీచంద్ తో రెండు సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చిన యేలేటి మరో కొత్త ప్రయోగం చేయనున్నాడు. తేజు కాదన్న కథను గోపీచంద్ ఓకే చేయడంతో తేజు మంచి అవకాశం మిస్ అయ్యాడని ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments