డిజాస్టర్ ఊబిలో మెగా అల్లుడు.. వినాయక్ లాగుతాడా?

Tuesday, February 6th, 2018, 03:40:25 PM IST


స్టార్ హీరోల బ్యాక్ గ్రౌండ్ తో వచ్చే యువ హీరోలకు మొదటి హిట్ కొట్టడం కొంచెం ఈజీ అవుతుంది. మొదటి అడుగువరకే స్టార్ హీరోల సహాయం చాలా ఉంటుంది. ఇక ఆ తరువాత రిజల్ట్ తో సంబంధం లేకుండా వారే సినిమాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల సపోర్ట్ తో వచ్చిన చాలా మంది హీరోలు ఎవరి స్థాయిలో వారు రాణిస్తున్నారు. ఇక అదే తరహాలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్. మొదట ఈ హీరో రేయ్ సినిమాతో కొంచెం తడబడిన సరే ఆ తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ – సుప్రీమ్ సినిమాలతో చాలా వరకు మంచి హిట్స్ అందుకున్నాడు.

కలెక్షన్స్ పరంగా కూడా కొంచెం కొంచెం తన సినిమాలను పెంచుకుంటూ వస్తోన్న సమయంలో ఈ హీరో మళ్లీ డిజాస్టర్స్ ఊబిలో పడిపోయాడు. వరుసగా నాలుగు పరాజయాలను చూడాల్సి వచ్చింది. తిక్కా – విన్నర్ అలాగే నక్షత్రం – జవాన్ సినిమాలు సాయి ధరమ్ తేజ్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ బాగానే ఉంది. అవకాశాలు కూడా బాగానే అందుతున్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా అనుభవం ఉన్న దర్శకులతోనే వర్క్ చేస్తున్నాడు. కానీ హిట్టు మాత్రం కొట్టలేకపోతున్నాడు. అయితే మొన్నటి వరకు చేసిన నాలుగు సినిమాలు ఒక లెక్క అయితే ఇప్పుడు రాబోయే ఇంటిలిజెంట్ సినిమా ఈ హీరోకి మరో లెక్క. ఖైదీ నెంబర్ 150 లాంటి బాక్స్ ఆఫీస్ హిట్ తరువాత వివి.వినాయక్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో మాస్ ప్రేక్షుకుల్లో కొంచెం అంచనాలు భారీగానే ఉన్నాయి.

కానీ సినిమా ట్రైలర్ అయితే ఎదో నార్మల్ గానే ఉంది. వినాయక్ గత సినిమాల మాదిరిగానే ఉంటుందా అనే డౌట్ కూడా వస్తోంది. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పరవాలేదు గాని కొంచెం డివైడ్ టాక్ వచ్చినా కష్టమే. ఎందుకంటే సీజన్ కానీ సీజన్ లో వస్తోంది. అంతే కాకుండా కొన్ని సినిమాలు కూడా పోటీకి దిగాయి. ఫిబ్రవరి 9న ఇంటలిజెంట్ సినిమాతో పాటు మోహన్ బాబు గాయత్రి సినిమా రాబోతోంది. ఆ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ట్రైలర్ కి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక ఫిబ్రవరి 10న మరో మెగా తనయుడు వరుణ్ తేజ్ తొలిప్రేమ రాబోతోంది. ఆ సినిమాపై కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఫిదా తరువాత వరుణ్ కి చాలా వరకు క్రేజ్ ఏర్పడింది.

ఆ సినిమాకు ఏ మాత్రం హిట్ టాక్ వచ్చిన సాయికి కష్టకాలం తప్పదు. అయితే మాస్ యాక్షన్ సీన్స్ తీయడంలో వినాయక్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఇంటిలిజెంట్ సినిమాలో గనక కరెక్ట్ గా అలాంటి సీన్స్ పడితే సాయి ధరమ్ డిజాస్టర్స్ కి చెక్ పడినట్లే. కాని గత సినిమాల్లానే ఏ మాత్రం రొటీన్ గా అనిపించినా సాయి కెరీర్ మళ్లీ డౌన్ అవ్వడం కాయం. ప్రస్తుతం మెగా హీరోలందరూ ఫామ్ లోనే ఉన్నారు. కానీ సాయి ఒక్కడే కొంచెం వెనుకడుగు వేశాడు. మరి ఇంటిలిజెంట్ తో అయినా ఈ మెగా మేనల్లుడిని వినాయక్ కాపాడతాడో లేదో చూడాలి.