వరుణ్ తేజ్ vs సాయి ధరమ్ తేజ్ ఫిక్స్!

Thursday, January 25th, 2018, 01:45:17 AM IST

మెగాస్టార్ మేనల్లుడు ఒకరు, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు ఒకరు. నిజానికి ఇద్దరు ఇద్దరే అని చెప్పాలి. ఇద్దరు తమ శైలిలో మంచి చిత్రాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే వచ్చే నెల ఫిబ్రవరి 9న ఈ ఇద్దరు స్టార్స్ ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగనున్నారు. తొలిప్రేమ కు సంబంధించి ఈనెల 20 న ఆడియో వేడుక వైభవంగా జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే సాయిధరమ్ తేజ్ తన నూతన చిత్రం ఇంటిలిజెంట్ ను వి వి వినాయక్ దర్శకత్వం లో చేస్తున్నారు. సుప్రీమ్ తర్వాత మంచి విజయం ఏది సాయి కి దక్కలేదనే చెప్పాలి. నిజానికి ఖైదీ చిత్రం విజయం తర్వాత వినాయక్ కూడా తన తదుపరి చిత్రం ఎవరితో చేస్తే బాగుంటుందనే విషయమై చానళ్లు వేచి చూసి చివరకు సాయిధరమ్ తో ఫిక్స్ అయ్యారు. ఈ చిత్రానికి సంబంధించి విశేషాలను తెలపడానికి యూనిట్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. అందులో భాగంగా హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ, చిత్రం షూటింగ్ మొత్తం ఎప్పుడు పూర్తి అయిందో కూడా అర్ధం కావడం లేదు, షూటింగ్ మొత్తం చాలా హ్యాపీగా కూల్ గా సాగిపోయింది, యూనిట్ సభ్యులు రేయింబవళ్లు చాలా కష్టపడి పనిచేశారన్నారు. తనని వినాయక్ సర్ చాలా బాగా చూపించారని, స్క్రీన్ మీద తనని తాను చూసుకున్నాక నమ్మలేకపోయానన్నారు. నన్ను చాలా అద్భుతంగా చూపించారు వినాయక్ సర్, మీకు చాలా పెద్ద థాంక్స్ అని చెప్పారు. మెగాస్టార్ లాంటి హీరోతో చిత్రం చేసిన దర్శకులు తదుపరి కూడా అలాంటి ఒక పెద్ద స్టార్ తోనే చిత్రం చేస్తారు అనుకుంటాం కానీ, అనూహ్యంగా ఆయన నాతో సినిమా చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయం అన్నారు. థమన్ ప్రతి సారి లానే ఈ సారి కూడా తన చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చాడన్నారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో కలిసి వర్క్ చేయడం చాలా బాగుందని, చిత్రం లో తన నటన అద్బుతమన్నారు. అలానే తమ సినిమా ను ఫిబ్రవరి 9న విడుదల తేదీగా నిర్ణయించామని ఆయన తెలిపారు. తమ చిత్రం విడుదల రోజునే వరుణ్ తొలిప్రేమ కూడా విడుదల కానుండడంతో రెండు చిత్రాలు మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. వరుణ్ సినిమాతో తమ సినిమాకు ఎంత వరకు పోటీ అని అడిగిన ప్రశ్నకు అయితే తనకు తమ కుటుంబంలో ఎవరితో పోటీ లేదని, అసలు తాను అలాంటి పోటీ పడాలని ఎప్పుడు అనుకోనని చాలా ఇంటిలిజెంట్ గా సమాధానం ఇచ్చారు సాయిధరమ్ తేజ్…