నైజాం బాక్సాఫీస్‌ని కొల్ల‌గొట్టే ప్లాన్‌లో విన్న‌ర్‌!

Thursday, February 23rd, 2017, 12:03:44 PM IST


మెగా హీరోల్లో ఉన్న గొప్ప‌త‌నం అదే. మార్కెట్ ఏదైనా కొల్ల‌గొట్టేయ‌డం, జేబులో వేసుకోవ‌డ‌మే వీళ్ల ప‌ని. ముఖ్య ంగా మాస్‌లో బాస్‌లుగా పిలుపించుకుని మెగా వృక్షం హీరోలు నైజాం మార్కెట్‌ని దోచేస్తారు. ఇక్క‌డ వీళ్ల సినిమాల‌కు ఉండే క్రేజు వేరొక హీరోకి ఉండ‌నే ఉండ‌దు. మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్ సాగించిన హ‌వా ఆ త‌ర్వాత చ‌ర‌ణ్‌, బ‌న్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ వ‌రుస‌లోనే సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా వెళుతున్నాడు. నైజాంలో త‌న మార్కెట్ రేంజును పెంచుకునే ఎత్తుగ‌డ‌ల్ని అనుస‌రిస్తున్నాడు.

సాయిధ‌ర‌మ్ న‌టించిన విన్న‌ర్‌ ఈనెల 24న గ్రాండ్‌గా రిలీజ‌వుతోంది. గుర్ర‌పు పందేల బ్యాక్ డ్రాప్‌లో ఆక్తిక‌ర క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమా ప్ర‌మోష‌న్‌ని డిఫ‌రెంటుగా చేస్తున్నారు. ఇప్ప‌టికే సింగిల్స్ పేరుతో పాట‌లు లాంచ్ చేస్తున్నారు. అలాగే సాయిధ‌ర‌మ్ హ‌నుమ‌కొండ‌ వెళ్లి అక్క‌డ `ఓరుగ‌ల్లు ఉత్స‌వ్ ఫెస్టివ‌ల్ -2017` పోస్ట‌ర్‌ని లాంచ్ చేసి నైజాం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నాడు. అక్క‌డ‌ ప్ర‌ఖ్యాత సిఐటిఎస్ కాలేజ్‌లో ఈ ఈవెంట్ జ‌రిగింది. ఓరుగల్లు ఫెస్టివల్ ఏప్రిల్ 9న వ‌రంగ‌ల్ -జ‌వ‌ర‌హ‌ర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్‌కి వేలాది మంది అటెండ్ అవుతార‌ని తెలుస్తోంది.