పిక్ టాక్ : మెగా మేనల్లుడు మూవీ ప్రీ లుక్ రిలీజ్

Wednesday, April 25th, 2018, 04:59:14 PM IST

మెగా ఫ్యామిలీ అంటేనే ఇటు చిత్ర సీమలో అటు సినీ అభిమానుల్లో ఏదో తెలియని ఉత్తేజం సినిమాలు చూడాలని తమ ప్రియతమ నటులను ప్రోత్సహించాలని ఆత్రుతం. కానీ ఇటీవల వరుస ఫ్లాప్స్ తో బెజారెత్తిపోయిన యువహీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తొలి ప్రేమ అనే అందమైన ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించిన కరుణా కరన్ తో సినిమా చేస్తున్నాడు . కేఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. డార్లింగ్ సినిమాలకు మాటలు అందించిన డార్లింగ్ స్వామి ఈ చిత్రానికి కూడా మాటలు అందిస్తున్నాడు. సినిమాకు దేవుడు వరమందిస్తే అనే టైటిల్ ఖరారు చేసినట్లు ఈ మధ్య చిత్ర సీమలో వార్తలు వెలువడుతున్నాయి.

కాని అదంతా రూమర్ అని సాయిధరమ్ తెలియజేశాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ ను అధికారికంగా రివీల్ చేస్తామన్నారు. అయితే గోపీ సుందర్ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. కొద్ది సేపటి క్రితం చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ విడుదల చేశారు మేకర్స్ . ప్రీ లుక్ లో సాయిధరమ్ ని బ్యాక్ నుండి చూపించిన మేకర్స్ చిత్ర ఫస్ట్ లుక్ ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా అదే రోజు రివీల్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇంటెలిజెంట్ సినిమాల తర్వాత సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక దర్శకుడు కరుణాకరన్ చివరిగా నితిన్ తో చిన్న దాన నీ కోసం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments