క్రిష్ – మహేష్ ప్రాజెక్ట్ తెరకెక్కపోవడానికి కారణమిదే!

Thursday, July 26th, 2018, 02:22:54 PM IST

మంచి కథలను తెరపై ఎంతో బావోద్వేగంతో చూపించే దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్). ఇక టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరో మహేష్ బాబు. క్రిష్ మహేష్ కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుందని గతంలో చాలా వార్తలు వచ్చాయి. అది నిజమే అయినా ఇంతవరకు పట్టాలెక్కలేదు. మహేష్ క్రిష్ చెప్పిన కథను విని వెంటనే ఒకే చేశాడు. ఆ విషయం అధికారికంగా బయటకు రాలేదు.

అయితే ఆ కాంబినేషన్ పై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రచయిత బుర్ర సాయి మాధవ్ స్పందించారు. సాయి మాధవ్ గత కొంత కాలంగా క్రిష్ ప్రతి సినిమాకు పనిచేస్తూ వస్తున్నారు. ఇక మహేష్ – క్రిష్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. ఆ కాంబినేషన్ సెట్టయిన మాట వాస్తవమే. నేను కూడా ఆ ప్రాజెక్ట్ లో ఉన్నాను. అయితే ఇది సెట్స్ పైకి వెళ్లిపోవడానికి ఒకే ఒక్క కారణం ఉంది. మహేష్ బాబు గారికి డేట్స్ దొరికినప్పుడు క్రిష్ బిజీగా ఉంటున్నాడు. క్రిష్ ఖాళీగా ఉన్నప్పుడు మహేష్ బాబు గారు బిజీ అవుతున్నారు. అంతకు మించి ఇతర కారణాలు ఏమి లేవు. అది ఒక మంచి కాన్సెప్ట్ అని తప్పకుండా ఆ సినిమా తెరకెక్కుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదని తాను చెప్పగలనని సాయి మాధవ్ వివరణ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments