లిప్ లాక్ సీన్స్..అమ్మానాన్నా ఒప్పుకోరు అంటున్న క్రేజీ హీరోయిన్..!

Tuesday, January 16th, 2018, 04:45:43 PM IST

సౌత్ లో ప్రస్తుతం సాయి పల్లవి ఒక సంచలనం. వెండి తెరపై చూపు తిప్పలేని పెర్ఫామెన్స్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అలా అని రెగ్యులర్ హీరోయిన్స్ లాగా గ్లామర్ షోతో సాయి పల్లవి పాపులర్ కాలేదు. సాయి పల్లవి చలాకి నటనకు కుర్ర కారు ఫిదా అయిపోయారు. హీరోలని సైతం డామినేట్ చేస్తుందని పలు రకాల పుకార్లు సాయి పలలవి గురించి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. కథల విషయంలో తాను ఎంత సెలక్టివ్ గా ఉంటానో మరో మారు సాయి పల్లవి తేల్చి చెప్పింది.

గ్లామర్ పేరుతో స్కిన్ షో కు తాను వ్యతిరేకం అని సాయి పల్లవి తన అభిప్రాయాన్ని బయట పెట్టింది. తన ముఖం మీద మొటిమలు ఉన్నపటికీ గ్లామర్ గానే కనిపిస్తున్నా కదా అని అంటోంది. సినిమాలని ఎంపిక చేసే సమయంలో తాను ఎక్కువ కండిషన్లు పెడుతున్నానని కొందరు అంటున్నారు. అలాంటి అభిప్రాయాలను నేనేమి చేయలేను. కొందరు కథ గురించి చెప్ప కుండా పాలా హీరో పక్కన నటిస్తావా అని అడుగుతున్నారు. సినిమా కథ అంటే వారి దృష్టిలో హీరోనేనా అంటూ ఘాటుగా బదులిచ్చింది. లిప్ లాక్ వంటి సన్నివేశాలు నావల్ల కాదు.. అలాంటి సన్నివేశాలని మా అమ్మ నాన్న కూడా అంగీకరించరు అని తేల్చి చెప్పింది.