ఆటో రాణిగా సాయిప‌ల్ల‌వి ప్ర‌యోగం

Wednesday, May 16th, 2018, 04:27:16 PM IST

తొలి నుంచి ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల్లో న‌టించి యువ‌త‌రం గుండెల్ని గెలుచుకుంది సాయి ప‌ల్ల‌వి. ప్రేమ‌మ్‌, ఫిదా చిత్రాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించి మెప్పించింది. ఇత‌ర నాయిక‌ల‌తో పోలిస్తే సాయిప‌ల్ల‌వి సంథింగ్ స్పెష‌ల్ అని అంతా అంగీక‌రించారు. ఇప్పుడు మ‌రోసారి ఈ భామ అంత‌కుమించిన ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌తో అభిమానుల్ని అల‌రించ‌నుంది.

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ స‌ర‌స‌న ఈ భామ `మారి 2`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి పాత్ర పూర్తి వైవిధ్యంగా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. తాజా అప్‌డేట్ ప్ర‌కారం ఈ చిత్రంలో ఓ ఆటోక్వీన్ పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి న‌టించ‌నుందిట‌. ఇప్ప‌టికే ఆటో న‌డ‌ప‌డం ఎలానో ప్రాక్టీస్ చేస్తోంద‌ని స‌మాచారం. మారి-1లో చంద‌మామ కాజ‌ల్ క‌థానాయిక‌. ఇప్పుడు మారి 2లో సాయి ప‌ల్ల‌వి ఆ పాత్ర‌కు కొన‌సాగింపు పాత్ర‌లో న‌టిస్తోంది. అయితే కాజ‌ల్‌తో పోలిస్తే పూర్తి భిన్న‌మైన పాత్ర‌కు సాయి ప‌ల్ల‌విని ఎంపిక చేశార‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. అమ్మాయి ఆటో న‌డ‌ప‌డం అన్న‌ది కిక్కిచ్చే ఎలిమెంట్‌. ఆటో రాణిగా సాయి ప‌ల్ల‌వి విన్యాసాలు పెద్ద తెర‌పై చూడాల్సిందే. అందుకు కొంత‌కాలం వేచి చూడాలి.