సాయి పల్లవి బర్త్ డే ధమాకా…

Wednesday, May 9th, 2018, 11:32:23 AM IST

మ‌ల‌యాళం బ్లాక్ బ‌స్ట‌ర్ ప్రేమ‌మ్ చిత్రంలో మ‌ల్ల‌ర్ పాత్ర పోషించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన భామ సాయి ప‌ల్ల‌వి. తెలుగులో ఫిదా తో భానుమ‌తి గా అంద‌రి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని త‌మ ఇంట్లో మ‌నిషిలా ఫీల‌వుతున్నారు తెలుగు ప్రేక్ష‌కులు. నాని స‌ర‌స‌న ఎంసీఏ చిత్రంలో న‌టించి అల‌రించింది. ఇటీవ‌ల క‌ణం అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సాయిపల్లవి హోమ్లీగా, అందంగా కనిపిస్తోంది. దాంతో ప్రొడ్యూసర్లు సాయిప‌ల్ల‌వికి వ‌రుస ఆఫ‌ర్స్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం తెలుగులో శ‌ర్వానంద్, హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న‌ చిత్రంలో న‌టిస్తుంది. ప‌డి ప‌డి లేచే మ‌న‌సు అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బేనర్‌పై రూపొందుతుంది . రొమాంటిక్ చిత్రాల స్పెషలిస్ట్ హను రాఘవపూడి ఈ సినిమాని కూడా చాలా స్టైలిష్ గా రూపొందిస్తున్నాడ‌ని సమాచారం. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కూడా సాయిప‌ల్ల‌వికి మంచి పేరు తెస్తుంద‌ని అంటున్నారు. అయితే ఈ రోజు సాయి ప‌ల్ల‌వి బ‌ర్త్ డే కావ‌డంతో చిత్ర బృందం సాయిప‌ల్ల‌వికి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తూ అంద‌మైన ప్రేమ క‌థా చిత్రం పోస్ట‌ర్స్ రిలీజ్ చేసింది. ఇందులో సాయిప‌ల్ల‌విని చూసి తెగ మురిసిపోతున్నారు అభిమానులు.

  •  
  •  
  •  
  •  

Comments