సాయి పల్లవి ప్రేమలో పడిందా.. ఛాన్సే లేదు ?

Saturday, October 14th, 2017, 07:34:38 PM IST

మొదటి సినిమాతోనే మలయాళంలో భారీ హిట్ అందుకున్న భామ సాయి పల్లవి. ఆ తర్వాత నటించిన సినిమా కూడా అమ్మడికి మరో భారీ హిట్ ఇచ్చింది. ఇక తెలుగులో అలా ఎంట్రీ ఇచ్చిందో లేదో ఫిదా సినిమాతో మరో బాక్స్ ఆఫీస్ రికార్డును అందుకుంది. ప్రస్తుతం మరికొన్ని పెద్ద సినిమాల్లో కూడా నటిస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ లో ఇప్పుడు అందరు ఆమె తో ఒక సినిమాను చెయ్యాలని చూస్తున్నారు.

కానీ సాయి పల్లవి మాత్రం తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే ఒకే చేస్తోంది. అయితే ప్రస్తుతం ఆమెపై కొన్ని రూమర్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. కోలీవుడ్ లో సాయి పల్లవి ఒక స్టార్ తో ప్రేమలో పడిందని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా అతనికి ముందే ఒకసారి పెళ్లి కూడా అయ్యిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఫిదా బ్యూటీ అలా కాదు అని కొందరు అంటున్నారు. ఎందుకంటే వ్యక్తిగతంగా సాయి పల్లవి ఎలాంటిదో మలయాళీ అభిమానులకు తెలుసు. సాయి పల్లవి అలా చాటుమాటుగా నడిపించే టైపు కాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ రూమర్స్ బాగానే వస్తున్నా అమ్మడు మాత్రం ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి.. భవిష్యత్తులో అయినా స్పందిస్తుందో లేదో ?

  •  
  •  
  •  
  •  

Comments