రియల్ లైఫ్ రోల్ లో వరుణ్ తేజ్ హీరోయిన్

Saturday, May 12th, 2018, 02:18:51 PM IST

ఫిదా సినిమాతో ఆడియెన్స్‌ను ఫిదా చేసింది కోలీవుడ్ బ్యూటీ సాయిపల్లవి. ఈ హీరోయిన్ నటిస్తున్న తాజా చిత్రం పడి పడి లేచె మనసు. హనురాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో సాయిపల్లవి రియల్‌లైఫ్ పాత్రను పోషిస్తుందట. సాయిపల్లవి కోల్‌కతాకు చెందిన మెడికో పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఈ చిత్రం కోల్‌కతా షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్. సాయిపల్లవి ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అన్న విషయం తెలిసిందే. ఎంత స్టార్‌డమ్ సంపాదించిన తనకు వైద్య వృత్తి అంటే చాలా ఇష్టమని సాయిపల్లవి పలు ఇంటర్యూల్లో కూడా చెప్పింది.

  •  
  •  
  •  
  •  

Comments