మంత్రి కొడుకుతో సాయిపల్లవి పెళ్లి?

Monday, June 11th, 2018, 04:44:28 PM IST

ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మది దోచిన ముద్దు గుమ్మ సాయిపల్లవి. ఆ చిత్ర విజయంలో చాలాభాగం సాయిపల్లవికి దక్కుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇక ఆ తరువాత ఆమెకు ఆఫర్లు వెల్లువలా వచ్చిపడినప్పటికీ, ఆమె మాత్రం సెలెక్టెడ్ గా నటిగా ప్రాధాన్యంవున్న సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఆ తరువాత ఆమె నాచురల్ స్టార్ నానితో కలిసి నటించిన ఎంసీఏ చిత్రం కూడా మంచి విజయం అందుకుంది. కాకపోతే ఆ తరువాత ఆమె నటించిన హేయ్ పిల్లగాడా, తరువాత నాగ శౌర్యతో నటించిన కణం చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగా నిలబడలేకపోయాయి. ఇక ప్రస్తుతం ఆమె తెలుగులో శర్వానంద్ తో పడిపడి లేచేమనసు, అలానే తమిళంలో సూర్య సరసన ఎన్జీకే, ఇక ధనుష్ సరసన మారి-2 చిత్రాల్లో నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఆమెకు సంబందించిన ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అది ఏంటంటే, సాయి పల్లవి ఒక మంత్రి కుమారుడితో వివాహం నిశ్చయమయింది అని.

ఆ మంత్రి కుమారుడు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినవాడేనట. ఇటీవల సాయి పల్లవితో తన లవ్ ని ఎక్స్ ప్రెస్ చేసిన అతడు ఆమె తన నిర్ణయంపై కొంచెం సందేహించడంతో తన తల్లితండ్రులను ఏకంగా ఆమె ఇంటికి తీసుకెళ్లి పెళ్లి విషయం మాట్లాడినట్లు చెపుతున్నారు. అయితే ఆ సమయంలో కొంత ఆలోచనలో పడ్డ సాయి పల్లవి తల్లితండ్రులు చివరకు ఒప్పుకున్నారని, ఇక త్వరలోనే ఎంగేజ్మెంట్ పెట్టుకుని పెళ్లి మాత్రం కొంత కాలం తర్వాత చేయాలనీ నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. ఈ వార్తల్లో ఎంత మేరకు నిజం ఉందొ తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచిచూడవలసిందే. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వర్గాల్లో వైరల్ గా మారింది……

  •  
  •  
  •  
  •  

Comments