ఈసారి సాయికుమార్ గెట‌ప్ లీక్‌!

Thursday, July 26th, 2018, 02:31:15 PM IST

ప‌ల్లెటూరిలో రైస్‌మిల్లు అంటే మోతుబ‌రి మాత్ర‌మే పెట్ట‌గ‌ల‌డు. న‌లుగురు ప‌నోళ్ల‌ను పెట్టుకుని మిల్లు వోన‌ర్‌గా కాల‌ర్ ఎగ‌రేస్తూ ఊళ్లో తిరిగే పెద్ద మ‌నిషిగా చెలామ‌ణి అవ్వ‌డం అంటే ఆషామాషీనా? అలాంటి పెద్ద మ‌నిషి పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ట డైలాగ్ కింగ్ సాయికుమార్‌. తెల్ల‌చొక్కా, న‌ల్ల ఫ్యాంటు, ఆపై రెబాన్ పెట్టుకుని త‌ల అంచున నుదిటిపై రింగు తిప్పుతూ సాయికుమార్ గెట‌ప్ చాలా వెరైటీగానే ఉంటుందిట‌. అయితే ఈ రైస్‌మిల్ ఏ ఊళ్లో ఉంటుంది? ఏ సినిమాలోది? అని మాత్రం అడ‌క్కండి. ఎందుకంటే ఈ మిల్లు ఓ ప‌ల్లెటూళ్లో ఉంటుంది.

అది కూడా మ‌హేష్ 25గా చెబుతున్న విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమాలోనిది. రైతు స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్న సినిమాలో మ‌హేష్ రైతుగా న‌టిస్తుంటే, న‌రేష్ అత‌డికి స్నేహితుడిగా క‌నిపించ‌నున్నాడు. సీనియ‌ర్ న‌టుడు సాయికుమార్ మిల్లు య‌జ‌మానిగా ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో భారీ విలేజ్ సెట్స్ వేసి చిత్రీక‌ర‌ణ చేస్తుంటే అక్క‌డి నుంచి సాయికుమార్ గెట‌ప్‌పై లీకులందాయి. మ‌హేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగ‌స్టు 9న ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేయ‌నున్నారు. 2019 ఏప్రిల్‌లో సినిమాని రిలీజ్ చేస్తారు.

  •  
  •  
  •  
  •  

Comments