శైలజ రెడ్డి గారి అల్లుడికి ఇంకో పది కోట్లు కావాలంట..!

Monday, September 17th, 2018, 06:46:54 PM IST

వినాయకచవితి పర్వదినం సందర్భంగా సమంత మరియు నాగ చైతన్య జంటగా కాకపోయినా ప్రేక్షకుల ముందుకు కలిసే వచ్చారు.ఐతే వీరి ఇద్దరి సినిమాల్లో మాత్రం మారుతి దర్శకత్వం వహించిన నాగచైతన్య మరియు అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన శైలజ రెడ్డి గారి అల్లుడు చిత్రం యొక్క పరిస్థితి మాత్రం కొంచెం బాలేదని చెప్పాలి. పండగ సమయం మరియు వీకెండ్ ఆదివారాలతో శైలజ గారి అల్లుడికి బాగానే కలిసి వచ్చింది. కానీ అన్ని సినిమాల్లాగానే ఈ చిత్రం కూడా మామూలుగానే ఉందని ప్రెకషకులు పెదవి విరిచేసారు.

దీనితో ఇప్పుడు నుంచి వచ్చే కలెక్షన్ బట్టి శైలజ గారి అల్లుడు స్టామినా ఏంటో తెలుస్తుంది. సమంతా కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ అందులో రీమేక్ చిత్రంతో రావడం వాళ్ళ ఆ చిత్రం గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి.కానీ చైతు విషయంలో మాత్రం అలా కాదు ఈ చిత్రానికి దాదాపు 24 కోట్లు వరకు బిజినెస్ అయ్యినట్టు తెలుస్తుంది. కానీ ఈ చిత్రం ప్రస్తుతం 14 కోట్లను రాబట్టింది,ఇప్పుడు నుంచి అసలైన పరీక్ష మొదలవుతుంది.ఈ సినిమాకి ఎలాంటి నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఇంకో 10 కోట్లు రావాలి. ఇప్పుడున్న పరిస్థిలుతుల్లో అంత రాబట్టడం కాస్త కష్టమే అని సినీ విశ్లేషకులు అంటున్నారు.ఈ చిత్రానికి వచ్చిన టాక్ ని బట్టి నాగచైతన్య కూడా ఇక నుంచి ఇంకా మంచి సినిమాలు తీస్తానని బహిరంగంగానే చెప్పితన పెద్ద మనసును చాటుకున్నాడు.చూద్దాం శైలజ రెడ్డి గారి అల్లుడు ఎంత రాబట్టగలుగుతాడో.