సైనా నెహ్వాల్ బ‌యోపిక్ స్టార్ట్ డేట్ ఇదే

Wednesday, January 31st, 2018, 05:38:25 PM IST

బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌, హైద‌రాబాద్ అమ్మాయి సైనా నెహ్వాల్ బ‌యోపిక్ గురించి ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వెలువ‌డిన‌ సంగ‌తి తెలిసిందే. సైనా పాత్ర‌లో శ్ర‌ద్ధాక‌పూర్ నాయిక‌గా న‌టిస్తుంద‌ని, ఈ చిత్రానికి ఆమోల్ గుప్తా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది. ఆ క్ర‌మంలోనే సైనా పాత్ర కోసం శ్ర‌ద్ధా హైద‌రాబాద్ పుల్లెల గోపిచంద్ అకాడెమీలో శిక్ష‌ణ తీసుకుంది. అయితే మ‌ధ్య‌లో ఏమైందో ఈ సినిమా ఆగిపోయింద‌న్న ప్ర‌చారం సాగింది. దీంతో సైనా అభిమానులు, శ్ర‌ద్ధా ఫ్యాన్స్ ఎంతో నిరాశ‌కు గుర‌య్యారు. తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. ఈ ప్రాజెక్టు ఆగిపోలేద‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు ద‌ర్శ‌కుడే ఓ క్లారిటీనిచ్చారు.

సైనా బ‌యోపిక్ ఆగిపోలేదు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నుంచి సెట్స్‌కెళుతుంది. ఇక ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో ట్రైనింగ్ తీసుకున్న‌ శ్ర‌ద్ధాక‌పూర్ ఆ శిక్ష‌ణ‌ను ముంబైలోనూ సాగిస్తోంది. సైనా శ‌రీరాకృతి త‌న‌కు మాత్ర‌మే ఉంది. అందుకే త‌ను యాప్ట్‌… సైనా సొంత న‌గ‌రం అయిన‌ హైద‌రాబాద్ లోనే సినిమా మొద‌టి షెడ్యూల్ ప్రారంభిస్తాం. ఆ స‌మ‌యంలోనే ఫ‌స్ట్‌లుక్ కూడా రిలీజ్ చేస్తామ‌ని ద‌ర్శ‌కుడు వెల్ల‌డించారు. ఇక‌పోతే శ్ర‌ద్ధా వ‌రుస ప‌రాజ‌యాల వ‌ల్ల ఈ సినిమా చేసేందుకు ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌లేద‌న్న వార్త‌ల్ని ఆయ‌న ఖండించారు. శ్ర‌ద్ధా క‌పూర్ న‌ట‌ప్ర‌తిభ‌పై త‌న‌కు పూర్తి విశ్వాసం ఉంద‌ని తెలిపాడు. రెండేళ్లుగా ఈ సినిమా స్క్రిప్టు కోసం ఎంతో క‌స‌ర‌త్తు చేశాన‌ని ఆమోల్ వెల్ల‌డించారు.