నైజాం యాస‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌

Saturday, June 9th, 2018, 11:59:01 AM IST

`ఫిదా` చిత్రంలో నైజాం పోరిగా న‌టించి ఆక‌ట్టుకుంది సాయి ప‌ల్ల‌వి. ఆంధ్రా భాష మాట్లాడే అబ్బాయి- నైజాం యాస‌లో ర‌ఫ్‌గా ఉండే అమ్మాయి ల‌వ్‌స్టోరి అంద‌రికీ న‌చ్చింది. ఆ క్ర‌మంలోనే సాయి ప‌ల్ల‌వికి నైజాంలో వీరాభిమానులేర్ప‌డ్డారు. ఓ తెలుగు దిన‌ప‌త్రిక ఏకంగా సినిమా పేజీ లోగోగా `ఫిదా`ని ఎంపిక చేసుకుందంటే అర్థం చేసుకోవ‌చ్చు. సాయిప‌ల్ల‌వి నైజాం యాస అంత‌టి ప్ర‌భావం చూపించింది. అందుకే అప్ప‌టినుంచి నైజాం యూత్ అంతా ఈ భామ‌నే బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా భావించారు.

ఇప్పుడు మ‌రోసారి సాయి ప‌ల్ల‌వి నైజాం యాక్సెంట్‌ని కాపాడే య‌త్నం చేస్తోంది. ఆ భాష‌లో మాట్లాడే పాత్ర‌ను ఎంపిక చేసుకుంది. `నీది నాది ఒకే క‌థ‌` ఫేం వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేందుకు సాయిప‌ల్ల‌వి సంత‌కం చేసింది. ఇదో నాయికా ప్రాధాన్య చిత్రం. ఇందులో సాయిప‌ల్ల‌వి మ‌రోసారి ఫిదా త‌ర‌హా నైజాం యాస‌తో మ్యాజిక్‌ని రిపీట్ చేయ‌బోతోంద‌ని చెబుతున్నారు. ఇక‌పోతే ఈ భామ శ‌ర్వానంద్ స‌ర‌స‌న ఓ సినిమాలో న‌టిస్తోంది. త‌మిళంలో ప‌లు క్రేజీ ప్రాజెక్టుల‌కు సంత‌కాలు చేసింది. ఇరు ప‌రిశ్ర‌మ‌ల్లో బిజీబిజీగా ఉంది.