యుద్దానికి సిద్దమైన సైరా ?

Friday, June 1st, 2018, 10:45:03 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ చిత్రం సైరా . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7నుండి హైద్రాబాద్ లో భారీ షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక యుద్ధ నేపధ్య సన్నివేశాలను తెరకెక్కిస్తారట. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏకంగా 200 కోట్లతో నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో నయనతార, తమన్నాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1850నేపథ్యంలో జరిగిన కథతో ఈ సినిమా ఉండబోతుంది. ఇటీవలే హైద్రాబాద్ లో వేసిన రంగస్థలం సెట్స్ లో పదిరోజుల పాటు షూటింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తారట.

  •  
  •  
  •  
  •  

Comments