వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సజ్జల రామకృష్ణ రెడ్డి

Thursday, February 25th, 2021, 04:22:25 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తాజాగా అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఖాళీ అయిన ఆరు ఎమ్మేల్యే ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణ రెడ్డి మీడియా కి వివరాలను వెల్లడించారు. చల్లా భగీరథ రెడ్డి, బల్లి కళ్యాణ చక్రవర్తి, సి. రామచంద్రయ్య, మహ్మద్ ఇక్బాల్, దువ్వాడ శ్రీనివాస్ మరియు కరీమున్నీసా ల ను ప్రకటించారు. అంతేకాక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అభ్యర్దిని నిలబెట్టడం లేదు అని సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు.