ఎక్కడా లేని సమస్య హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకే వస్తోంది – సజ్జల రామకృష్ణారెడ్డి

Friday, May 14th, 2021, 04:24:20 PM IST

సరిహద్దుల్లో అంబులెన్స్ లను ఆపొద్దు అని తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చెప్పినా అక్కడి పోలీసులు అడ్డుకుంటున్నారు అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తమ వాళ్ళను తామే చూసుకోవాలి అనే పట్టుదలలు పెరుగుతున్నాయి అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీని పై సంయమనం తో వ్యవహరిస్తున్నాం అని వ్యాఖ్యానించారు. న్యాయస్థానాలను ఆశ్రయించి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని రోగులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు అని అన్నారు. అయితే ఎక్కడా లేని సమస్య హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకే వస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇది మానవత్వం తో చూడాల్సిన వ్యవహారం అని, ఈ వ్యవహారం పై సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులతో చర్చించారు అని మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. అయితే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ప్రాంతాలను తమకు ఇచ్చారు అంటూ ఈ సందర్భం గా చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ సరిహద్దు వద్ద అంబులెన్స్ లను అడ్డుకోవడం పట్ల ప్రతి పక్స పార్టీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి దీని పై అధికార పార్టీ కి చెందిన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.