శంక‌ర్ మ‌రో ముమైత్‌ని దించేశాడు!

Tuesday, September 4th, 2018, 11:32:15 PM IST

జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ష‌క‌ల‌క శంక‌ర్ ఎంత ఫేమ‌స్ అయ్యాడో తెలిసిందే. హాస్య న‌టుడిగా బుల్లితెర‌పై రాణించి అటుపై ఏకంగా వెండితెర‌కు ప్ర‌మోట‌య్యాడు. అంతేకాదు.. ఇప్పుడు హీరో అయ్యి ఏకంగా నాలుగో సినిమాలో న‌టించేస్తున్నాడు. అదేదో కామెడీ హీరో అనుకునేరు. భీక‌ర‌మైన యాక్ష‌న్ హీరోగా శంక‌ర్ అంద‌రికీ షాకిస్తున్నాడు. ఇటీవ‌లే శంభో శంక‌ర చిత్రంతో ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ హీరోగా అద‌ర‌గొట్టేశాడు. శంక‌ర్ హార్డ్ వ‌ర్క్ అంద‌రికీ న‌చ్చింది.

ఇటీవ‌లే మూడో సినిమా డ్రైవ‌ర్ రాముడు గురించి స‌మాచారం అందింది. ఆ సినిమా గురించి మాట్లాడుకుంటుండ‌గానే, కేడి నంబ‌ర్ 1 అంటూ మ‌రో సినిమాతో బ‌రిలో దిగిపోయాడు. రీసెంటుగా లాంచ్ చేసిన శంక‌ర్ పోస్ట‌ర్ చూసి మిష‌న్ ఇంపాజిబుల్ హీరోనా? అంటూ జ‌నం షాక్ తిన్నారు. ఆ లెవ‌ల్లో శంక‌ర్‌లోని మేకోవ‌ర్ అంద‌రికీ నిజంగానే స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. తాజాగా ముమైత్ ఖాన్ ని కొట్టే ముమైత్ లాంటి ఐటెమ్ భామ‌తో శంక‌ర్ స్టెప్పులేసేస్తున్నాడు. ఆ ఐటెమ్ పాట మేకింగ్ వీడియోని లైవ్‌లోకి తెచ్చారు మేక‌ర్స్. ఇందులో శంక‌ర్ స‌ర‌స‌న పూజా రాజ‌శేఖ‌ర్ అనే ఐటెమ్ భామ స్టెప్పులేస్తోంది. ఇక ఈ ఐటెమ్ నంబ‌ర్‌తోనే థియేట‌ర్ల‌లో ఓ ఊపు ఊసేస్తాడ‌న‌డంలో సందేహం లేదు. దీనికి శివ‌శంక‌ర్ మాష్టార్ శిష్యుడు అజ‌య్ కొరియోగ్ర‌ఫీ అందించాడు. మొత్తానికి శంక‌ర్ ఊపు చూస్తుంటే ఉత్త‌రాంధ్ర‌తో పాటు, నైజాం కూడా ఈసారి షేక‌య్యేట్టే క‌నిపిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments