కుర్ర హీరో సినిమాకు దిల్ రాజు భారీ అఫర్ .. ఇదే సాక్ష్యం ?

Wednesday, July 11th, 2018, 11:27:25 AM IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుసగా పెద్ద దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు . దానికి కారణం అయన తండ్రి బెల్లంకొండ సురేష్. అయితే తన కొడుకును హీరోగా నిలబెట్టేందుకు సురేష్ చేస్తున్న ప్రయత్నాన్ని అందరు అభినందిస్తున్నారు. సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అయినా అల్లుడు శీను సూపర్ హిట్ అవ్వడంతో ఆ తరువాత చేసిన రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసుకుని త్వరలో విడుదలకు సిద్దమైన ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగిందట. నిజంగా ఈ కుర్ర హీరో సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం అందరికి షాకిస్తుంది. ముక్యంగా నైజం ఏరియా హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు 7 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం.

నైజం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామ నిర్మిస్తున్న ఈ సినిమాకు దాదాపు 40 కోట్ల బిజినెస్ జరిగిందట . ఈ కుర్ర హీరో మార్కెట్ స్థాయికి నిజంగా ఇది పెద్ద మొత్తమే. అయితే ఈ విషయంలో ఇది నిజామా లేదా కావాలనే హైప్ క్రియేట్ చేస్తున్నారా అన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. నైజాంతో పాటు మిగతా ఏరియాల హక్కులు కూడా భారీ రేటుకే అమ్ముడైనట్టు టాక్. మొత్తానికి ఈ కుర్ర హీరో తన మార్కెట్ స్థాయిని స్టార్ హీరోలకు ధీటుగా పెంచుకోవడం నిజంగా మంచి పరిణామమే.

  •  
  •  
  •  
  •  

Comments