‘సలాం తెలంగాణ’ అంటూ సవాళ్ల పరిష్కారం

Wednesday, October 15th, 2014, 12:36:50 PM IST

salam-telengana
రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను చూపించేందుకు తెలంగాణ సర్కార్ కొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ‘సలాం తెలంగాణ – ఇది పొడుస్తున్న పొద్దు’ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఐటీ, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘సలాం తెలంగాణ – ఇది పొడుస్తున్న పొద్దు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్‌.. నూతన రాష్ట్రంలో భవిష్యత్తును నిర్మించుకునేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని తెలిపారు.

తెలంగాణలో సాధారణ మానవుడి జీవితాంశాలు, కలలు, ఆకాంక్షలు, కొత్త రాష్ట్రం, కొత్త విద్యాకర్తల గురించి సలాం తెలంగాణ కార్యక్రమంలో చర్చించడం జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. మన రాష్ట్రం మన బాధ్యత ఇతివృత్తం నేపథ్యంలో సలాం తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం వల్ల ప్రభుత్వం, ప్రజల మధ్య అగాధాన్ని తొలగిస్తుందన్నారు. కేవలం మ్యూజిక్‌ కాకుండా ప్రజల సమస్యల పట్ల మీడియా ఎలా స్పందిస్తుందో తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనమని తెలిపారు.

గడిచిన 3 వారాలుగా విద్య, ఆరోగ్యం, పవర్‌, రవాణా స్మార్ట్‌సిటీ, సంస్కృతి, పెట్టుబడులు వంటి అవకాశాలను ఈ కార్యక్రమం ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను మంత్రి కేటీఆర్‌, ప్రముఖ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ఓఝా, ప్రముఖ రచయిత సుద్దాల అశోక్‌తేజ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ ఆవిష్కరించారు.