జీతం 1200.. ఆస్తులు కోట్లలో .. షాకింగ్

Wednesday, September 28th, 2016, 04:07:01 PM IST

mny
కార్ల కంపెనీ లో సేల్స్ మ్యాన్ గా ఉద్యోగం వస్తే జీతం ఎంత రావచ్చు ? మహా అయితే రెండు వేలు మూడు వేలు అతని జీతం కూడా అంతే 1200 కి దగ్గరలో ఉంటుంది. కానీ అతని ఆస్తులు చూస్తే మాత్రం కళ్ళు బైర్లు గమ్ముతాయి . సంవత్సర సంపాదనతో తో కూడా కొనలేని ఎన్నో వస్తువులు ఇప్పుడు అతని సొంతం. బొలేరో, ఆల్టో కార్లు, యాక్టివా, షైన్ ద్విచక్రవాహనాలు ఇలా ఎన్నో ఉన్నాయి అతని దగ్గర. మధ్య ప్రదేశ్ లో ని సిది జిల్లాలో అతను ఇప్పుడు పెద్ద డిస్కషన్ అయిపోయాడు. సిధి జిల్లాలో ఒక చిన్న దుకాణం లో సేల్స్ మెన్ గా పని చేస్తున్న సురేష్ ప్రసాద్ పాండే ఆస్తుల మీద ఎవరో లోకాయుక్త అధికారులు ఉప్పు అందించారు. దాంతో వీరు దాడులు నిర్వహించి సోదా చెయ్యగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అతని వద్ద కోట్ల రూపాయల విలువైన స్థిర, చరాస్తులు లభించాయి. అతని వద్ద 8 బ్యాంకు ఖాతాల్లో లక్షల రూపాయలున్నాయి. ఇప్పుడిక ఇంత ఎలా సంపాదించాడన్న విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు. అతను దగ్గరలోని కార్లకంపెనీ లో కొన్నాళ్ళు సేల్స్ మ్యానేజర్ గా పనిచేసాడు అనీ రిజిస్ట్రేషన్ లేకుండా కార్లు అమ్మడం , తక్కువ రేటు లో సెకండ్ హ్యాండ్ కార్లు కొని వాటిని అమ్మడం అతని అలవాటు అనీ చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments