స్టార్ హీరోతో కుర్ర‌హీరోయిన్ కులుకులు

Thursday, June 7th, 2018, 01:29:52 AM IST

ఈ అమ్మ‌డి వ్య‌వ‌హారం గ‌త కొంత‌కాలంగా తేడా కొడుతోంది. ఆ కులుకుల్లో ఏదో తేడా కొడుతోంది. త‌న‌కు అవ‌కాశం ఇచ్చాడు క‌దా అని అలుసుగా తీసుకుందో.. లేక అత‌డే స‌ర్వ‌స్వం అనుకుంటోందో.. అస‌లు ప‌బ్లిక్‌ని సైతం లెక్క చేయ‌డం లేదు. అస‌లు అత‌గాడి గురించి మాట్లాడే అవ‌కాశం వ‌స్తే.. త‌నువంతా పుల‌కించిపోయి మాట్లాడేస్తోంది. గుండె లోతుల్లోంచి అత‌డిని ఆరాధాన‌గా చూస్తే త‌పించిపోతోంది. ఈ త‌ప‌న చూస్తుంటే ప్రేమ‌లోంచి పుట్టిన మైకంలానే అనిపిస్తోంది. అస‌లింత‌కీ ఏమా మైకం? అంటే.. ఎవ‌రి గురించి? అంటే ఇదిగో జాక్విలిన్ అలియాస్ జాకీ గురించే.

ఈ భామ కెరీర్ పూర్తిగా సంపులో ప‌డి కొట్టుకుంటున్న‌ప్పుడు స‌రిగ్గా స‌ల్మాన్ భాయ్ నేనున్నానంటూ స్నేహ‌హ‌స్తం అందించాడు. త‌న స‌ర‌స‌న కిక్ చిత్రంలో అవ‌కాశం ఇచ్చాడు. ఆ సినిమా బంప‌ర్ హిట్ కొట్ట‌డంతో జాకీ పేరు మార్మోగిపోయింది. అటుపై ఇటీవ‌లే జూ.స‌ల్మాన్ వ‌రుణ్‌ధావ‌న్ స‌ర‌స‌న జుడ్వా 2 చిత్రంలో జాకీకి అవ‌కాశం వ‌చ్చేలా రిక‌మండ్ చేశాడు స‌ల్మాన్ భాయ్‌. అంతేనా.. ఇప్పుడు ఏకంగా రేస్- 3 చిత్రంలో త‌న స‌ర‌స‌న ఛాన్సిచ్చేశాడు. ఈ వ్య‌వ‌హారంతో జాక్విలిన్ భాయ్ కోసం ఏం చేయ‌డానికైనా రెడీ అయిపోతాన‌ని పబ్లిగ్గానే చెబుతోంది. అస‌లు భాయ్ కోరాలే కానీ.. అంటూ ఆఫ‌ర్ చేస్తోంది. మొత్తానికి ఈ కుర్ర‌హీరోయిన్ వ్య‌వ‌హారం పూర్తిగా ముదిరిన‌ట్టే క‌నిపిస్తోంది. అస‌లింత‌కీ స‌ల్మాన్ – జాక్విలిన్ మ‌ధ్య ఏం జ‌రుగుతోంది? ఇంత‌కీ లులియా వాంటూర్ ఎక్క‌డ‌? అస‌లు క‌నిపించ‌దేం?