స‌ల్మాన్‌పై బెయిలబుల్ వారెంట్‌ ర‌ద్దు!

Saturday, April 21st, 2018, 07:57:46 PM IST


స‌ల్మాన్ భాయ్ టైమ్ బాలేదు! అత‌డిని కోర్టు కేసులు వ‌దిలిపెట్ట‌డం లేదు. వ‌రుస‌గా ఒక‌దాని వెంట ఒక‌టిగా స‌మ్మెట దెబ్బ‌లు త‌గులుతున్నాయ్‌. ఇహ‌లోకంలో చేసిన త‌ప్పుల‌కు ఇప్పుడే శిక్ష‌లు అనుభ‌వించే స‌న్నివేశం అత‌డిని వెంటాడుతోంది. మొన్న‌టికి మొన్న కృష్ణ జింక‌ల వేట కేసులో స‌ల్మాన్ కి ఐదేళ్ల జైలు విధించారు. ఆ క్ర‌మంలోనే భాయ్ కండిష‌న్ల బెయిల్‌పై బ‌య‌టికి వ‌చ్చాడు. అయితే ఈసారి హిట్‌&ర‌న్ కేసు.. భాయ్‌ని వెంబ‌డిస్తోంది. అయితే ఈ కేసులో స‌ల్మాన్‌కి కాస్తంత ఊర‌ట‌.

కృష్ణ జింక వేట కేసులో బెయిల్ దొర‌క‌గానే సంబ‌రాలు చేసుకున్న అభిమానులు మ‌రి కాస్త రిలీఫ్ పీల‌య్యే స‌న్నివేశం క‌నిపిస్తోంది. 2002 హిట్ అండ్ ర‌న్ కేసులో స‌ల్మాన్‌కి బెయిల‌బుల్ వారెంట్ ర‌ద్దు చేస్తూ ముంబై సెష‌న్స్ కోర్ట్ తీర్పునివ్వ‌డం భాయ్‌లో ఆనందానికి కార‌ణ‌మైంది. త‌ప్ప‌తాగి ఫుట్‌పాత్‌పై నిదురిస్తున్న వారిపైనుంచి కార్ న‌డిపిన కేసు లో స‌ల్మాన్ ఇప్ప‌టికీ కోర్టుల ప‌రిధిలో వాయిదాల‌కు వెళుతున్నాడు. తాజాగా ఇలా బెయిల‌బుల్‌ వారెంట్ ర‌ద్ద‌వ్వ‌డం అందుకు కావాల్సిన ఫార్మాల్టీస్‌ని స‌ల్మాన్ పూర్తి చేయ‌డం కుదిరింది. అస‌లే స‌ల్మాన్ ని న‌మ్ముకుని 1000 కోట్ల ప్రాజెక్టులు ఆన్‌సెట్స్ ఉన్నాయి. ఏం తేడా వ‌చ్చినా అంతే సంగ‌తి. అందుకే అత‌డి విష‌యంలో జ‌రిగే ప్ర‌తి యాక్ట్‌ని ప‌రిశ్ర‌మ ఎంతో నిశితంగా ప‌రిశీలిస్తోంది. కోర్టు కేసులు భాయ్‌ని ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌కుండా చేస్తున్నా.. కొన్ని సానుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments