ఆ క్రికెటర్ ఒక ‘రోగ్’..ఓ రేంజ్ లో ఫైర్ అయిన మాజీ..!

Tuesday, September 26th, 2017, 05:27:35 PM IST


పాకిస్థాన్ క్రికెటర్ సల్మాన్ భట్ తిరిగి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఏళ్లపాటు క్రికెట్ కు దూరమైన సల్మాన్ భట్ కు తిరిగి క్రికెట్ ఆడే అవకాశాన్ని పాక్ క్రికెట్ బోర్డు కల్పించింది. దీనిపై పాక్ మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత రమీజ్ రాజా స్పందించాడు. సల్మాన్ భట్ ఓ రోగ్ క్రికెటర్ అని అతడికి మరలా ఆడే అవకాశం ఎలా ఇస్తారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫిక్సింగ్ చేసిన వారికీ కఠిన శిక్షలని ఎందుకు అమలు చేయడం లేదని పాక్ క్రికెట్ బోర్డుని ప్రశ్నించారు.

పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఫిక్సింగ్ కు పాల్పడిన వారిపై కూడా ఎంతో జాలి చూపించి శిక్షలు అమలు చేస్తున్నారని పిసిబి పై రమీజ్ రాజా సెటైర్ వేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన వ్యక్తిని జాతీయ జట్టులోకి ఆహ్వానం పలకడం ద్వారా పిసిబి ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకుందని రమీజ్ రాజా ప్రశ్నించారు. 2010 లో ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా అసిఫ్, అమిర్ మరియు భట్ లకు జైలు శిక్షతో పాటు ఐదేళ్ల నిషేధాన్ని కూడావిధించారు. నిషేధం పూర్తి కావడంతో వీరు పాక్ జట్టులో తిరిగి ఆడే అవకాశాన్ని పొందారు.

  •  
  •  
  •  
  •  

Comments