ప్ర‌భాస్ రేంజ్‌ అందుకోవ‌డంలో ఫెయిలైన‌ ఖాన్‌!?

Saturday, January 6th, 2018, 08:09:59 PM IST

బాలీవుడ్‌లో ఖాన్‌ల హ‌వా గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. అందరిలోనూ స‌ల్మాన్ ఖాన్ ప్ర‌త్యేక‌త గురించి అస‌లే చెప్పాల్సిన ప‌నేలేదు. అత‌డికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అసాధార‌ణ ఫాలోయింగ్ దృష్ట్యా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌న‌మే సాగుతుంది. సునాయాసంగా బాక్సాఫీన్‌ని పుల్ చేసే హీరోగా అత‌డికి పేరుంది. ద‌శాబ్ధాల కెరీర్‌లో అత‌డు చూడ‌ని రికార్డులే లేవు. ఎందరు ఖాన్‌లు ఉన్నా త‌న స్టైల్లో తాను దూసుకుపోతూనే ఉన్నాడు. అలాంటి స్టార్ హీరో .. బ్లాక్ బ‌స్ట‌ర్ అన్న టాక్ తెచ్చుకుని మ‌న ప్ర‌భాస్ ముందు తలొంచ‌డం చూస్తుంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు.

ఇంత‌కీ అంత‌టి ప‌రిస్థితి ఏం వ‌చ్చింది? అని ఆరాతీస్తే.. స‌ల్మాన్ భాయ్ న‌టించిన సెన్సేష‌న‌ల్ హిట్ చిత్రం `టైగ‌ర్ జిందా హై` నేటితో 300 కోట్ల క్ల‌బ్‌లో చేర‌బోతోంది. ఈ సినిమా అప్ర‌తిహ‌తంగా జైత్ర‌యాత్ర సాగిస్తోంది. బాక్సాఫీస్ వ‌ద్ద 15రోజుల పాటు వ‌సూళ్ల మోత మోగించింది. అయితే టైగ‌ర్ ఎంత మోత మోగించినా మ‌న ప్ర‌భాస్ న‌టించిన `బాహుబ‌లి-2` ముందు మాత్రం తోక ఝాడించ‌లేక‌పోయింది. ఈ సినిమా ఓపెనింగ్ డే, ఓపెనింగ్ వీకెండ్‌లో బాహుబ‌లి – 2 ముందు తేలిపోయింది. బాహుబ‌లి-2 రికార్డుల్ని ట‌చ్ చేయ‌లేక‌పోయింది. ఇక 11వ రోజువ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి. 11వ రోజు నాన్ హాలీడేలో బాహుబ‌లి-2 చిత్రం 17 కోట్లు ఈజీగా క‌లెక్ట్ చేస్తే, అదే రోజు హాలీడే వ‌చ్చినా టైగ‌ర్ జిందా హై 18 కోట్లు మాత్ర‌మే క‌లెక్ట్ చేసింది. ఇత‌ర హీరోల రికార్డులు ప‌రిశీలిస్తే, అమీర్ దంగ‌ల్ 11వ రోజు 13కోట్లు వ‌సూలు చేస్తే, పీకే 11వ రోజు 10 కోట్లు వ‌సూలు చేసింది. భ‌జ‌రంగి భాయిజాన్ అయితే 9.22కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. ఈ వ‌సూళ్ల రికార్డుల్ని బ‌ట్టి చూస్తే, ఖాన్‌లెవ‌రూ మ‌న ప్ర‌భాస్ బాహుబ‌లి-2ని ట‌చ్ చేయ‌లేక‌పోయార‌నే దీన‌ర్థం. స‌ల్మాన్ టైగ‌ర్ జిందా హై ఫుల్ ర‌న్‌లో బాహుబ‌లి- 2 రికార్డులు కొట్టేయ‌డం క‌ష్ట‌మే. ఇప్ప‌టికైతే 300 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. బాహుబ‌లి-2 హిందీ బాక్సాఫీస్ నుంచి సుమారు 600 కోట్లు పైగా వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది.