51 వ‌య‌సు స్టిల్ బ్యాచిల‌ర్‌.. బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌!

Tuesday, December 27th, 2016, 03:25:24 PM IST

salman
50 వ‌య‌సులో మ‌నోళ్లు ఎలా ఉంటారు? వ‌య‌సైపోయింది.. నాకెందుకు సోకులు.. ! అంటూ నీర‌సించిపోరూ.. కానీ ఈ 51 ఏళ్ల స్టిల్ బ్యాచిల‌ర్ ఈ వ‌య‌సులోనూ బాక్సాఫీస్‌ని గ‌జ‌గ‌జ‌లాడిస్తున్నాడు. 500 కోట్లు, 600 కోట్లు వ‌సూళ్లు తెచ్చే సినిమాల్లో న‌టిస్తున్నాడు. వంద‌ల‌కోట్ల వ్యాపార‌సామ్రాజ్యానికి అధిప‌తిగా కొన‌సాగుతున్నాడు. అంతేకాదండోయ్‌.. ఎప్ప‌టిక‌ప్పుడు న‌చ్చిన గాళ్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్నాడు. కేవ‌లం లోక‌ల్ గాళ్స్ మాత్ర‌మే ఇత‌గాడికి స‌రిపోరు. విదేశాల‌నుంచి వ‌చ్చి హాట్ చిక్స్ కావాలి మ‌రి. అస‌లు భూమ్మీద ఇంద్రుడు ఎవ‌రు? అంటే ఇత‌గాడిని చూపిస్తే స‌రిపోతుంది.

అందుకే ఇంకా ఇంత హాట్‌గా ఉన్నాడు కాబ‌ట్టే 51 వ‌య‌సు వ‌చ్చిన మాటే అతగాడికి తెలియ‌దాయే. ఏదైతేనేం పుట్టిన‌రోజు వ‌చ్చింది క‌దా.. అని ముంబైలో ఘ‌న‌మైన పార్టీ మాత్రం ఇచ్చాడు. ముంబై శివారులోని త‌న ఫామ్‌హౌస్‌లో మ‌స్త్‌గా పార్టీ చేసి ఎంజాయ్ చేశాడు. సుల్తాన్ గ్రాండ్ స‌క్సెస్‌, ఫోర్బ్స్ జాబితాలో నంబ‌ర్ -1 పొజిష‌న్ ఈ ఏడాది అత‌డికి బోన‌స్‌లు. అస‌లింత‌కీ ఎవ‌రీయ‌న‌? ఇక చెప్ప‌న‌క్క‌ర్లేదు. స‌ల్లూ భాయ్ అలియాస్ సల్మాన్‌ఖాన్ గురించే ఇదంతా. ప్ర‌స్తుతం సల్మాన్‌ ఖాన్ త‌న‌కెంతో ఇష్టుడైన‌ కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో ట్యూబ్‌లైట్‌ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments