బన్నీ డాన్స్ మరియు స్టైల్ పై సల్మాన్ ఖాన్ పొగడ్తల వర్షం

Monday, April 26th, 2021, 12:51:18 PM IST

టాలీవుడ్ లో తన డాన్స్ తో మాత్రమే కాకుండా స్టైల్ తో కూడా ఆకట్టుకొనే స్టార్ హీరో ఎవరు అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పాలి. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా, అటు నార్త్ లో ఇటు సౌత్ లో మాస్ మరియు క్లాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో బన్నీ అని చెప్పాలి. అయితే దువ్వాడ జగన్నాధం చిత్రం లో బన్నీ సీటి మార్ అంటూ వేసిన స్టెప్పులు ఇప్పటికీ కూడా అభిమానులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం సల్మాన్ రాధే అనే చిత్రం లో ఇదే సీటీ మార్ పాటకు చిందులు వేశారు. అయితే నేడు ఆ పాట విడుదల అయింది. అయితే ఈ మేరకు అల్లు అర్జున్ పై సల్మాన్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు.

సీటీ మార్ పాటకి అల్లు అర్జున్ వేసిన డాన్స్ మరియు స్టీల్ కి థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. సింప్లీ ఫెంటాస్టిక్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక జాగ్రత్తగా ఉండండి అంటూ తెలిపారు. లవ్ యు బ్రదర్ అల్లు అర్జున్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్ కి అల్లు అర్జున్ స్పందించారు. థాంక్యూ సో మచ్ సల్మాన్ ఖాన్ గారు అని అన్నారు. మీ నుండి ఇలాంటి ప్రశంస ను అందుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అయితే రాధే సినిమా కోసం అందులో సిటీ మార్ పెర్ఫార్మెన్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు.