ఇంటికెళ్లి నిద్రపోండి.. ఫ్యాన్స్ కు సల్మాన్ సూచన!

Sunday, April 8th, 2018, 09:43:10 AM IST

ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరికీ తెలియదు. సల్మాన్ పరిస్థితి కూడా గత 20 ఏళ్లుగా అలానే కొనసాగుతోంది. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ సల్మాన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇకపోతే కృష్ణ జింకలను వేటాడిన కేసులో రీసెంట్ గా సల్మాన్ కు జోధ్ పూర్ కోర్టు ఐదేళ్ల శిక్షను విధించిన సంగతి తెలిసిందే. అయితే అదృష్టవశాత్తు సల్మాన్ రెండు రోజుల తరువాత బెయిల్ అందుకున్నాడు. రెండు రోజుల పాటు ఒక సాధారణ ఖైదీలా జైలులో గడిపిన సల్మాన్ కు కోర్టు రూ.50 వేల పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసింది.

ఇకపోతే సల్మాన్ అయిదున్నర గంటల సమయంలో జైలు నుంచి విడుదలయ్యారని తెలిసి చాలా మంది అభిమానులను ఆయనను చూసేందుకు వెళ్లారు. సల్మాన్ ఇంటి ముందు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చేసరికి పోలీసులు అదుపుచేయలేక సతమతమయ్యారు. చివరకు సల్మాన్ బాల్కనీలోకి వచ్చి అభిమానులకు చేయి ఊపుతూ అభివాదం చేశారు. మీ ప్రేమకు చాలా కృతజ్ఞతలు ఇక ఇంటికెళ్లి నిద్రపోండని సల్మాన్ వారిని కోరడంతో అభిమానులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  •  
  •  
  •  
  •  

Comments