వీర్ ఘటి హీరోయిన్ విషయంపై స్పందించిన సల్మాన్

Sunday, March 25th, 2018, 10:57:33 PM IST

గత కొంత కాలంగా బాలీవుడ్ వీర్ ఘటి సినిమా హీరోయిన్ పూజ దడ్వాల్‌ గురించి అనేక కథనాలు వెలువడుతోన్న సంగతి తెలిసిందే. క్షయ వ్యాధితో బాధపడుతోన్న ఆమె ఒంటరిగా ముంబై హాస్పిటల్ లో ఉండడం అందరిని షాక్ కి గురి చేసింది. అయితే పూజ దయనీయ స్థితినిక్ చూసి బాలీవుడ్ యాక్టర్ రవి కిషన్ తన వంతు సహాయాన్ని అందించాడు. అయితే వీర్ ఘటీ లో ఆమెతో పాటు నటించిన సల్మాన్ ఖాన్ మాత్రం స్పందించలేదు. అయితే ఇటీవల పుణేలో సల్మాన్ దబాంగ్ టూర్ లో మీడియా పూజ ప్రస్తావనని తీసుకు వచ్చింది. ఫైనల్ గా సల్మాన్ ఖాన్ ఆ విషయంపై స్పందించాడు. పూజ విషయం ఇప్పటివరకు నాకు నిజంగా తెలియదు. నిజంగా తనకు అలా జరిగినందుకు చింతిస్తున్నాను. ఆమెకు మా వంతు సహాయాన్ని అందిస్తాం. అలాగే ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని సల్మాన్ మీడియాకు తెలిపాడు.