కార్టూన్ పాత్ర‌లో స‌ల్మాన్, జాన్ అబ్ర‌హామ్‌?

Tuesday, February 13th, 2018, 11:01:28 PM IST

పెద్ద తెర .. బుల్లితెర అనే తేడా లేకుండా కార్టూన్ సినిమాలు రాజ్య‌మేలుతున్నాయి. 3డి కార్టూన్ సినిమాల‌కు అద్భుత‌మైన గిరాకీ, ఆద‌ర‌ణ ఉంది. అందుకే అంత‌కంత‌కు కార్టూన్ సినిమాల వెల్లువ పెరుగుతోంది. మ‌న లోక‌ల్ హీరోల్ని కార్టూన్ క్యార‌క్ట‌ర్లుగా మార్చేసి, అద్భుత కార్టూన్ సినిమాల్ని తీయొచ్చు.

అయితే ముందుగా ఈ ప్ర‌య‌త్నం బాహుబ‌లి సిరీస్‌తో సాధ్య‌మైంది. తాజాగా బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ మిస్ట‌ర్ ఇన్‌క్రెడిబుల్ గా, హీ మ్యాన్‌గా కార్టూన్ పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సంగ‌తి తెలిసిన పిల్ల‌ల‌కు సంద‌డే సంద‌డి అన్న‌ట్టే ఉంది. జాన్ అబ్ర‌హాం, శుక్లా, ద‌ర్శిల్ స‌ఫారీ త‌దితర బాలీవుడ్ స్టార్లు కార్టూన్ క్యారెక్ట‌ర్లుగా క‌నిపించ‌నున్నారు. జాన్ అబ్ర‌హాం – జానీ బ్రావోగా, సౌర‌వ్ శుక్లా- డాన్ కార్ల్‌ట‌న్‌గా, ద‌ర్శీల్ స‌ఫారీ -బ‌గ్స్ బ‌న్ని గా, కికు శ్ర‌ద్ధా- ప్రిన్సెస్ ఫియోనా గా .. కార్టూన్ పాత్ర‌ల్లో క‌నిపించి అల‌రించ‌నున్నారు. తాము విప‌రీతంగా అభిమానించే హీరోని ఇలా కార్టూన్ పాత్ర‌ల్లో చూసుకోవ‌డం అన్న‌ది థ్రిల్లింగ్ ఎలిమెంట్. అందుకే ఈ త‌ర‌హా కార్టూన్ సినిమాల వెల్లువ ఇక మొద‌లైనట్టే. ప్ర‌స్తుత ట్రెండ్‌లో ఇది పెద్ద స్థాయికి ఎదిగే ఛాన్సుంది.