డ్రైవర్ ఇంట్లో పెళ్ళికి హాజరయ్యి తాను రియల్ హీరో అనిపించుకున్న సల్మాన్

Monday, January 30th, 2017, 04:01:23 PM IST

salman
మన సెలెబ్రిటీలు స్వంత బంధువుల ఇళ్లలోని ఫంక్షన్స్ కే వెళ్ళరు. కానీ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన దగ్గర పని చేసే ఒక డ్రైవర్ కుమారుడి పెళ్ళికి కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సల్మాన్ ఖాన్ దగ్గర అశోక్ సింగ్ అనే వ్యక్తి చాలా సంవత్సరాల నుండి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. సల్మాన్ కుటుంబ సబ్యులకు అశోక్ సింగ్ అంటే చాలా ఇష్టం. అతనిని తమ కుటుంబంలో ఒకరిగా చూసుకుంటారు. అంతేకాకుండా అతనిని భాయ్ అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు.

ఈ నేపథ్యంలోనే అశోక్ సింగ్ కుమారుడి వివాహానికి సల్మాన్ ఖాన్ తో పాటు ఆయన తండ్రి సలీం ఖాన్, సోదరుడు సోహైల్ ఖాన్, చెల్లెల్లు అర్పితా, అల్విరా ఉన్నారు. ఇంకా సల్మాన్ ఖాన్ బావ, అల్వీరా భర్త, సీనియర్ హీరో అతుల్ అగ్నిహోత్రి కూడా ఉన్నారు. అనేక కోర్ట్ కేసులలో ఇరుక్కుని వ్యక్తిగత జీవితంలో చికాకులు పడుతున్న సమయంలో కూడా సల్మాన్ ఖాన్ ఈ పెళ్ళికి కుటుంబ సమేతంగా హాజరు కావడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. మొత్తానికి తెర మీదే కాదు నిజ జీవితంలోను హీరో అనిపించుకున్నాడు మన సల్మాన్ ఖాన్.