షాక్…సల్మాన్ ఖాన్ తండ్రవుతున్నాడోచ్ ?

Wednesday, September 27th, 2017, 03:41:06 PM IST

అదేంటి .. బాలీవుడ్ లో అపర బ్రహ్మచారిగా యాభై ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లి కానీ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తండ్రి అవ్వడం ఏమిటి ? కొంపదీసి పెళ్లి ముందే చేసుకున్నాడా అని షాక్ అవుతున్నారా? కాదు .. !! సల్మాన్ కు పెళ్లి అంటే పెద్దగా ఆసక్తి లేదంట .. కానీ తన వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు మాత్రం మొదలు పెట్టాడు. ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీలు సరోగసి ( అద్దె గర్భం ) విధానంలో తల్లి, దండ్రులుగా మారుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరోలు తుషార్ కపూర్, షారుఖ్ ఖాన్ , అమీర్ ఖాన్ .. లేటెస్ట్ గా కరన్ జోహార్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి చేరుతున్నాడు సల్మాన్ ఖాన్. ఇప్పటికే కొంతమంది అనాధ పిల్లలను దత్తత తీసుకున్న సల్మాన్ వాళ్లకు తండ్రిగా అన్ని వసతులు కల్పిస్తూ కొత్త జీవితాన్ని అందిస్తున్నాడు. అయితే తన వారసులను తెచ్చుకోవాలనే ఆలోచనలో భాగంగా సరోగసి విధానంలో తండ్రిగా మారనున్నాడట. ఇప్పటికే ఆ ప్రయత్నం మొదలు పెట్టాడని తెలిసింది. అది విషయం !!

  •  
  •  
  •  
  •  

Comments