బెట్టింగ్ లో కోట్లు పోగొట్టుకున్న సల్మాన్ సోదరుడు

Saturday, June 2nd, 2018, 02:41:26 AM IST

బాలీవుడ్ నటుడు, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్ఫాజ్ ఖాన్ పై ఇటీవల ఐపీఎల్ బెట్టింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అతనికి సమన్లు కూడా అందాయి. అయితే ఈ బెట్టింగ్ లో అతను భారీగా డబ్బును పోగొట్టుకునట్లు తెలుస్తోంది. రీసెంట్ గా నేషనల్ ఛానెల్స్ తెలిపిన వివరాల ప్రకారం అర్ఫాజ్ ఖాన్ బుకీల ద్వారా బెట్టింగ్ చేశాడట. రెండు మ్యాచ్ లకు గాను అతను 3 కోట్ల వరకు డబ్బు పోగొట్టుకున్నట్లు సమాచారం.

అర్బాజ్ ఖాన్ ఒక్కడే కాకుండా ఈ బెట్టింగ్ లలో బాలీవుడ్ కి సంబందించిన వారి లిస్ట్ పెద్దగా ఉన్నట్లు టాక్. అర్బాజ్ బెట్ పెట్టిన తరువాత డబ్బు ఇవ్వకపోవడంతో సోనూ అనే బుకీ అర్బాజ్ పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఒక డైరీలో రాసుకున్న బుకీ వివరాలని పోలీసులకు ఇచ్చాడు. దీంతో పోలీసులు అర్బాజ్ కి సమన్లు పంపారు. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దుబాయ్ వేదికగా బుకీలు ఇక్కడ కార్యాచరణను నడుపుతున్నరట. ఈ కేసులో దావుద్ అనుచరులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకొని విచారణ జరుపుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments