దానికోసం సల్మాన్ రెండు కోట్ల అఫర్.. నో చెప్పిన ఫ్యాన్ !

Monday, February 12th, 2018, 06:16:26 PM IST

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హీరో సల్మాన్ ఖాన్ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా కలెక్షన్స్ ని చూసి చెప్పొచ్చు సల్మాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో. అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడే ఈ హీరోను చూడాలని రోజు ఎవరో ఒక అభిమాని ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇక సల్మాన్ తమ దగ్గరికి వస్తున్నాడు అంటే సంతోష పడే వారు చాలా మంది ఉంటారు. ఆయన ఏది అడిగినా ఇస్తారు కూడా. కానీ ఓ అభిమాని మాత్రం సల్మాన్ కోరుకున్నది మాత్రం ఇవ్వను అని మొహం మీదే చెప్పేశాడట.

సల్మాన్ కి గుర్రాలంటే చాలా ఇష్టం. గత కొంత కాలంగా వివిధ దేశాల నుంచి తెప్పించిన కొన్ని గుర్రాలను సల్మాన్ ఒక ఫామ్ ను ఏర్పాటు చేసి అందులో పెంచుతున్నాడు. అయితే రీసెంట్ గా సల్మాన్ కన్ను ‘సఖిబ్‌’ జాతికి చెందిన గుర్రంపై పడింది. అమెరికా, కెనడాల్లో మాత్రమే దొరికే ఈ గుర్రం గంటకు 43 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం సిరాజ్ అనే వ్యక్తి రాజస్థాన్‌ సంతలో సఖిబ్‌ జాతి గుర్రాన్ని కొన్నాడు. దీంతో రీసెంట్ గా సల్మాన్ అతని దగ్గరికి వెళ్లి దాని కోసం రూ.2కోట్లు ఇస్తానని చెప్పాడట. కానీ ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఎంత డబ్బు ఇచ్చినా అమ్మేది లేదని గట్టిగా చెప్పేశాడట. దీంతో ఆ విషయం బయటకి రావడంతో బాలీవుడ్ లో వైరల్ గా మారింది. సల్మాన్ ఆఫర్ ని వద్దన్న ఆ మనిషి ఎవరా అని సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి.