సల్మాన్ ప్రొడక్షన్ లో లవ్ రాత్రి.. సినిమాను అడ్డుకుంటామన్న వీహెచ్ పీ

Thursday, May 24th, 2018, 12:27:31 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బంధువు (బావ) సినిమాకు ఊహించని ఆటంకం ఎదురైంది. సినిమాను విడుదల చేస్తే మూల్యం చెల్లించక తప్పదని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) ఆగ్రహం వ్యక్తం చేయడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. సల్మాన్ బావ ఆయుష్ శర్మ లవ్ రాత్రి అనే సినిమాలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమా సల్మాన్ సొంత బ్యానర్ లో తెరకెక్కుతోంది. అయితే ఆ సినిమా టైటిల్ హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. నవరాత్రి పండుగను హిందువులు ఎంతో సాంప్రదాయ బద్దంగా జరుపుకునే పండగ. అలాంటి పేరులో రాత్రి అనే పదాన్ని కించే పరిచే విధంగా లవ్ రాత్రి ఉందని అలాగే సినిమాలో నవరాత్రి పండగ నేపథ్యంలో సినిమా ఉన్నందున సినిమాను అడ్డుకుంటామని ఆరోపించారు. సినిమాను విడుదల చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని విశ్వహిందూ పరిషత్ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments