సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్ చెప్పిన సల్మాన్…

Tuesday, April 10th, 2018, 10:11:22 AM IST

కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు అయిదేళ్లు జైలు శిక్ష విధించి ఆ త‌ర్వాత బెయిల్ మంజూరు చేసిన సంగ‌తి తెలిసిందే. జైల్లో రెండు రోజులు గ‌డిపిన త‌ర్వాత‌ షరతులతో కూడిన బెయిల్‌ను స‌ల్మాన్‌కి ఇచ్చింది జోధ్‌పూర్‌ కోర్టు. స‌ల్మాన్‌కి బెయిల్ వ‌చ్చింద‌నే వార్త తెలియ‌గానే ఇటు అభిమానులు అటు కుటుంబ స‌భ్యుల ఆనందానికి అవ‌ధి లేకుండా పోయింది. ఫ్యాన్స్‌తో పాటు సినీ సెల‌బ్రిటీలు కూడా స‌ల్మాన్ త్వ‌ర‌గా జైలు నుండి బ‌య‌ట‌కి రావాల‌ని ప్రార్ధించారు. క‌త్రినా, సోనాక్షి సిన్హా త‌దిత‌రులు స‌ల్మాన్ ఇంటికి చేరుకొని ఫ్యామిలీని ఓదార్చ‌గా, మ‌రి కొంద‌రు జైలుకి వెళ్ళి స‌ల్మాన్‌ని క‌లిసి ధైర్యం చెప్పారు. ఎన్నో ప‌రిణామాల మ‌ధ్య స‌ల్మాన్ బ‌య‌ట‌కి రావ‌డంతో అంద‌రు ఆనందంలో మునిగారు. అయితే క‌ష్ట‌స‌మ‌యాల‌లో త‌న‌తో పాటు ఉండి ధైర్యం చెప్పిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్యవాదాలు తెలియ‌జేశాడు స‌ల్మాన్‌. మీ ప్రేమ‌, స‌పోర్ట్‌కి కృత‌జ్ఞుడిని అంటూ స‌ల్మాన్ త‌న ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం రేస్ 3 అనే చిత్రాన్ని చేస్తున్న స‌ల్మాన్ ఈ మూవీ తర్వాత భ‌ర‌త్ అనే చిత్రం చేయ‌నున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments