ముద్దు సీన్స్ ఉంటేనే సినిమాలు హిట్ కావంటున్న సల్మాన్ ?

Wednesday, October 3rd, 2018, 10:39:35 PM IST


ఈ మధ్య ఏ సినిమాలో చుసిన మూతి ముద్దులు ఓ రేంజ్లో హల్చల్ చేస్తున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా ఈ లిప్ లాక్ సీన్స్ ఆగడం లేదు, దానికి తోడు హీరోయిన్ మితి మీరిన గ్లామర్ ఎక్స్పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ సినిమాల్లో కామన్ గా మారాయి. ఈ ముద్దుల హంగామా బాలీవుడ్ చిత్రాల్లోనే ఎక్కువ. తాజాగా ఈ విషయం పై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సెటైర్ వేసేశాడు . ఈ విషయం పై బి టౌన్ లో నానా రచ్చ నడుస్తుంది . హిందీ సినిమాల్లో మితి మీరిన శృంగారం, లిప్ లాక్ లు గ్లామర్ డోస్ లపై సల్మాన్ స్పందించాడు. కేవలం లిప్ లాక్ వల్ల సినిమాలు హిట్ అవ్వవు. అందాలు ఆరబోయడం, శృంగారం లాంటి అంశాలు కాదు .. అంటూ కామెంట్ చేసాడు. ముద్దు సన్నివేశాలను తాను పూర్తిగా వ్యతిరేకం అని చెప్పేసాడు. నిజమే సల్మాన్ ఖాన్ తన కెరీర్ 29 ఏళ్ల కెరీర్ లో ఏనాడూ సీనియమాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. సినిమా ఫ్యామిలీ తో కలిసి చూస్తున్నప్పుడు తల దించుకునేలా ఉండకూడదని అన్నాడు. ఓసారి ఓ ఆంగ్ల సినిమా సమయంలో ఇలాంటి పరిస్థితి తనకు ఎదురైందట అందుకే అలా తన సినిమాల్లో ఉండకూడదని ఫిక్స్ అయ్యాడు. ఇక బాలీవుడ్ బాద్షా కూడా తన సినిమాల్లో ఎప్పుడు లిప్ లాక్ సీన్స్ చేయలేదు .. ఈ మద్యే కత్రినా తో కలిసి జబ్ తక్ హై జాన్ లో ఒక్క సీన్ లో నటించాడు.