పక్కలోకి వస్తే ఛాన్స్ ఇస్తామనే వారు లేరు : సల్మాన్ ఖాన్

Saturday, December 2nd, 2017, 12:35:44 PM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏ విషయంపైన అయినా తన అభిప్రాయాన్ని సూటిగా చెబుతూ ఉంటాడు. అయితే రీసెంట్ గా ఈ హీరో చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలా వైరల్ అయ్యాయి. గత కొంత కాలంగా బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనే పదం బాగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా సల్మాన్ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ విషయం గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు.

సల్మాన్ మాట్లాడుతూ.. నేను చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. అలాంటి విషయాల గురించి ఎప్పుడు వినలేదు. నాతో పడుకుంటేనే అవకాశాలు ఇస్తాను అని చెప్పడం నిజంగా చాలా దారుణం. అయితే అలాంటి వారు బాలీవుడ్ లో లేరు అని సల్మాన్ అభిప్రాయపడ్డాడు. అంతే కాకుండా మా నాన్న గారు ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నారు ఆయన కూడా ఎప్పుడు ఇలాంటి వాటి గురించి వినలేదు అని చెప్పాడు. కానీ సల్మాన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కొన్ని కౌంటర్లు వస్తున్నాయి. బాలీవుడ్ లోనే ఎక్కువగా అలాంటివి జరుగుతాయి. గతంలో కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి. అవన్నీ సల్మాన్ కి తెలియవా అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments