బాలీవుడ్ కండల వీరుడుకి మళ్ళీ మొదలైన టైటిల్ వివాదం..!

Friday, September 28th, 2018, 11:13:36 AM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్న తాజా చిత్రం లవ్ యాత్రి పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమా టైటిల్ విషయంలో పలు హిందూ సంఘాలు టైటిల్ మార్చాలంటూ నానా రచ్చ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా లవ్ రాత్రి అనే టైటిల్ పెట్టారు .. ఈ సినిమా దసరా నవరాత్రుల నేపథ్యంలో ఈ కథ ఉంటుందట .. హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే ఈ నవరాత్రుల నేపథ్యంలో తీసిన సినిమాకు లవ్ రాత్రి అనే టైటిల్ పెడతారా అంటూ పెద్ద రాద్దాంతమే జరిగింది. దాంతో సల్మాన్ ఈ సినిమా టైటిల్ ని మర్చి లవ్ యత్రిగా పెట్టాడు. అయినా సరే ఈ టైటిల్ ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. సల్మాన్ పై బెదిరింపులకు పాల్పడుతున్నారట. దాంతో సల్మాన్ సుప్రీం కోర్టును సంప్రదించారు. భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ కేసును పరిశీలిస్తున్నారట. సల్మాన్ ఖాన్ బావ ఆయుష్ శర్మ ను హీరోగా పరిచయం చేస్తూ సల్మాన్ ఖాన్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కానుంది.