బ్రేకింగ్ న్యూస్ : జైలు నుంచి సల్మాన్ ఖాన్ విడుదల

Saturday, April 7th, 2018, 07:26:57 PM IST

1998 కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు జోధ్ పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి అందరికి తెలిసిందే. ఒక సాధరణ ఖైదీలా సల్మాన్ జైల్లో గడుపుతున్నాడు అనుకుంటున్నా సమయంలో కోర్టు నుంచి ఊరట లభించింది. 48 గంటల శిక్ష తరువాత సల్మాన్ బయట ప్రపంచాన్ని చూశాడు. శిక్ష విధించగానే సల్మాన్ బెయిల్ కోరిన వినతిని కోర్టు అంగీకరించి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు.

వెంటనే సల్మాన్ తరపు లాయర్లు బెయిల్ ఆర్డర్ కాగిలాకు సంబందించిన పనులను పూర్తి చేసి జైలు అధికారులకు అందించారు. రీసెంట్ గా జోధ్ పూర్ జైలు నుంచి సల్మాన్ అడుగు బయటపెట్టాడు. ఇక సల్మాన్ బయటకు రావడంతో ఆయన సన్నిహితులతో పాట అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దీంతో పోలీసులు సల్మాన్ ఇంటి దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇకపోతే కోర్టు తీరుపై పెటా (పీపుల్ ఫ‌ర్ ఎథిక‌ల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమ‌ల్స్) ఆగ్రహం వ్యక్తం చేసింది. సల్మాన్ ఖాన్‌ కు బెయిల్ ఇవ్వడం ఏ మాత్రం కరెక్ట్ కాదని బెయిల్ మంజూరు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. జింకలను చంపి మళ్లీ బయటకు రావడం..అలాగే మళ్లీ తన సినిమా స్టార్ లైఫ్‌ ను ఎంజాయ్ చేస్తూ ఉంటే.. మరొకరు కూడా తప్పటడుగు వేసే ఆస్కారం ఉందని పెటా పేర్కొంది.

  •  
  •  
  •  
  •  

Comments